Aussiesను కట్టడి చేసిన టీమిండియా.. 269 రన్స్‌కు ఆలౌట్
Aussies:మూడో వన్డేలో ఆసీస్ 269 పరుగులు చేసి ఆలౌట్ చేయ్యింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా (india) బౌలర్లు కంగారెత్తించారు. 49 ఓవర్లలో 269 రన్స్ చేసి.. భారత్ (india) ముందు 270 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో మార్ష్ 47, కేరీ 38, హెడ్ 33, లబుషేన్ 28, అబాట్ 26, స్టోయినిస్ 25, వార్నర్ 23 రన్స్ చేశారు.
Aussies:మూడో వన్డేలో ఆసీస్ 269 పరుగులు చేసి ఆలౌట్ చేయ్యింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను టీమిండియా (india) బౌలర్లు కంగారెత్తించారు. 49 ఓవర్లలో 269 రన్స్ చేసి.. భారత్ (india) ముందు 270 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఉంచింది. ఆసీస్ బ్యాట్స్ మెన్లలో మార్ష్ 47, కేరీ 38, హెడ్ 33, లబుషేన్ 28, అబాట్ 26, స్టోయినిస్ 25, వార్నర్ 23 రన్స్ చేశారు. మార్ష్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో పాండ్యా (pandya) పెవిలియన్ పంపించాడు. భారత బౌలర్లు అంతా రాణించారు.
తొలుత హర్థిక్ పాండ్యా (hardik pandya) హడలెత్తించాడు. 3 కీలక వికెట్లు తీసి ఆసీస్ నడ్డి విరిచాడు. తర్వాత అతనికి కుల్దీప్ యాదవ్ (kuldeep yadav) తోడయ్యాడు. యాదవ్ కూడా 3 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్ (siraj), అక్షర్ పటేల్ (axar patel) తలొ రెండు వికెట్ల చొప్పున తీశారు. దీంతో ఆసీస్ ఆలౌట్ అయ్యింది.
ఇప్పటికే టీమిండియా, ఆసీస్ చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ వన్డేలో గెలిస్తే.. సిరీస్ సొంతం అవుతుంది. ఈ రోజు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ తీసుకుంది. చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడుతూ జట్టుకు శుభారంభం ఇచ్చినప్పటికీ మిడిల్ ఆర్డర్ విఫలమైంది. 33 పరుగులు చేసిన హెడ్.. హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత స్టివ్ స్మిత్‌ను కూడా వెంటనే పాండ్యా ఔట్ చేశాడు.