సంగారెడ్డిలోని జిల్లా సైన్స్ కేంద్రంలో బుధవారం నిర్వహించిన జీవశాస్త్రం ప్రతిభా పరీక్ష పోటీల్లో గుమ్మడిదల మండలం అంతారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి జస్వంత్ ప్రథమ స్థానం సాధించాడు. జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతి, ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. జశ్వంత్ రాష్ట్రస్థాయిలో కూడా రాణించాలని డీఈఓ ఆకాంక్షించారు.