ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో గుకేశ్, లిరెన్ల మధ్య జరిగిన మ్యాచ్ పోటాపోటీగా సాగలేదని మాజీ ప్రపంచ ఛాంపియన్ కార్ల్సెన్ విమర్శించాడు. దీనిపై తాజాగా గుకేశ్ స్పందించాడు. ఫైనల్స్లో తాను 100 శాతం అత్యుత్తమంగా ఆడలేదని అంగీకరించాడు. టోర్నీ తీవ్రతను, రెండు వారాల పాటు తాను ఎదుర్కోబోతున్న ఒత్తిడిని అంచనా వేయలేకపోయినట్లు పేర్కొన్నాడు. కానీ, ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిని ఓడించగలిగానని తెలిపాడు.