ఈ ఏడాదిలో పలువురు సినీ ప్రముఖ జంటలు విడిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్, సైరా బాను దంపతులు పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. హీరో జయంరవి, ఆర్తి విడిపోయారు. సంగీత దర్శకుడు GV ప్రకాష్, సైంధవి.. బాలీవుడ్ నటి ఇషా డియోల్, భరత్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఊర్మిళ మంటొద్కర్, తన భర్త మెహిసిన్ అక్తర్ నుంచి విడాకులు కోరుతూ కేసు నమోదు చేసింది. క్రికెటర్ హార్దిక్ పాండ్య, నటాషా.. హీరో ధనుష్, ఐశ్యర్య అధికారికంగా విడిపోయారు.