JGL: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని, కళాధార పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు, హెచ్ఎం కమలాకర్, పీఈటి అజయ్ తెలిపారు. పాఠశాలకు చెందిన హైందవి, రిశ్వంత్, చరణ్ అనే విద్యార్థులు, మండల స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ చాటడంతో, జిల్లా స్థాయికి ఎంపికైనట్లు వారు పేర్కొన్నారు.