SRCL: ఇల్లంతకుంట మండలం వంతడుపుల గ్రామానికి చెందిన కట్ట శ్రీవల్లి అండర్-19 క్రికెట్ మహిళా వన్డే హైదరాబాద్ జట్టుకు ఎంపికైంది. జనవరి 4 నుంచి 12 వరకు కేరళలోని త్రివేండ్రంలో జరిగే క్రికెట్ పోటీల్లో పాల్గొంటుందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. శ్రీవల్లి అండర్ -19 క్రికెట్ మహిళా వన్డే హైదరాబాద్ జట్టుకు ఎంపికైనందుకు తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందించారు.