తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ గోల్డ్ కప్ క్రికెట్ 2025 ట్రోఫీని నిర్వహించనున్నట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గురువారెడ్డి అన్నారు. 2025 జనవరిలో నిర్వహించనున్న క్రికెట్ టోర్నీ సందర్భంగా ఆయన నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ గ్రౌండ్ ను సందర్శించారు. సందర్భంగా టోర్నీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు.