కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం జరగనున్న సీఎం కప్పు జిల్లా స్థాయి ఖోఖో పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి హీరా లాల్ తెలిపారు. పాల్గొన్న క్రీడాకారులు ఉదయం 9 గంటల వరకు మైదానంకు హాజరు కావాలని చెప్పారు. మండల స్థాయిలో ప్రతిభ చూపిన ఖోఖో క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని కోరారు.