AP: సైనికుడు, కవి, నవలా రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్(80) కన్నుమూశారు. విజయవాడ కృష్ణలంకలోని తన నివాసంలో నిన్న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. చిన్నతనం నుంచి రచనలపై ఆసక్తి ఉన్న ఆయన.. 11ఏళ్లకే రచనలు రాయడం ప్రారంభించారు. 1974లో ఆయన తొలికథ ప్రచురితమైంది. ఇప్పటివరకు 600కు పైగా కథానికలు రచించిన ఆయన.. 1965,1971లో భారత్, పాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు.