టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. జానపద కళాకారుడు, బలగం సినిమాలో నటించిన మొగిలయ్య అనారోగ్యంతో మరణించారు. ఏడాది కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు. కాగా, డైరెక్టర్ వేణు రూపొందిన ‘బలగం’ సినిమా క్లైమాక్స్‌లో పాడిన ‘తోడుగా మాతో ఉండి నీడగా మాతో నడిచి’ అనే పాటతో మొగిలయ్య పాపులర్ అయ్యారు. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీకి చెందిన పలువురు సంతాపం తెలిపారు.