గాడ్ ఫాదర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి మరో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. మెగా 154 వర్కింగ్ టైటిల్‌తో.. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్‌ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 24న ఉదయం 11:07 గంటలకు సినిమా టైటిల్ టీజర్‌ను లాంచ్ చేయనున్నట్టు.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మాసివ్‌గా ఉంది. ఇందులో ఒకప్పటి మాస్ మెగాస్టార్‌ను చూడొచ్చు. దీనిపై ‘బాస్ వస్తున్నాడు’ అని రాయడం అంచనాలని మరింత పెంచేసింది. దాంతో మెగా 154 మెగాభిమానులు మెగా కిక్ ఇవ్వడం పక్కా అంటున్నారు.
ఇక ఈ సినిమా టైటిల్, టీజర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా అదే రోజు అనౌన్స్ చేయబోతున్నారు. ఇక ఇప్పటి నుంచి సరికొత్త అప్టేట్స్తో ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. దాంతో మెగా 154 టైం స్టార్ట్ అయినట్టేనని చెప్పొచ్చు. ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ మధ్య వచ్చే సీన్స్ హైలైట్ నిలిచేలా ఉంటుందని అంటున్నారు. మరి మెగా 154 ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.