అధిక పింఛన్ వివరాలు సమర్పించేందుకు EPFO మరింత గడువు విధించింది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఉద్యోగుల వేతన వివరాలు అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కార్మికశాఖ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఇంకా 3.1 లక్షల మంది ఉద్యోగుల అధిక పింఛను దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పూర్తి చేసేందుకు ఇదే చివరి గడువు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.