ఐసీసీ బౌలర్ల ర్యాంకుల్లో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (890 పాయింట్లు) అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. మరోవైపు బ్యాటర్ల ర్యాంకుల్లో ఇంగ్లండ్ ఆటగాడు రూట్ టాప్-1లో ఉన్నాడు. టాప్-10లో భారత్ నుంచి జైస్వాల్ నాలుగో స్థానంలో, పంత్ 9వ స్థానంలో కొనసాగుతున్నారు.