KMM: జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జిల్లా స్థాయి సీఎం కప్పు క్రీడా పోటీలు జరిగాయి. గర్ల్స్ కబడ్డీ విభాగంలో మధిర పట్టణానికి చెందిన జట్టు జిల్లాస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి సాధించడం జరిగిందని సంబంధిత నిర్వాహకులు తెలియజేశారు. అదే విధంగా త్వరలో రాష్ట్రస్థాయిలో జరగనున్న పోటీలలో పాల్గొననున్నట్లు తెలిపారు.