TG: తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గా దిల్ రాజు ప్రమాణ స్వీకారం చేశారు. దిల్ రాజు పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఆయన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ TFDC ఛైర్మన్గా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.