ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న మూవీ ‘రాజాసాబ్’. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్‌కు గాయం కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుందని, అలాగే VFX, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆ తేదీన రిలీజ్ కావడం కష్టమేనని, మే చివరి వారంలో విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.