తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి నటి రాధికా ఆప్టే పలు విషయాలు పంచుకున్నారు. ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే తాను కంగారుపడ్డానని చెప్పారు. ప్రెగ్నెన్సీ అంత సులభమైన విషయం కాదని, మానసిక, శారీరక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. ఆ సమయంలో తన భర్త తనకు ఎంతో సపోర్ట్ చేశారని పేర్కొన్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా లావు అయ్యానని, ఎప్పుడు అలా లేనని అన్నారు. అలా తనని తాను చూసుకోవడానికి ఎంతో ఇబ్బందిపడ్డానని చెప్పారు.