నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న మూవీ ‘తండేల్’. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా రెండో పాట రిలీజ్ డేట్ ఖరారైంది. ‘శివ శక్తి’ అనే పాటను ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై చందూ ముండేటి తెరకెక్కిస్తున్న ఈ మూవీకి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 7న విడుదలవుతుంది.