బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 252/9 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన టీమిండియా 260 పరుగులకు ఆలౌట్ అయింది. KL రాహుల్ (84), జడేజా(77) రాణించారు. చివర్లో ఆకాశ్ దీప్(31) పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ బౌలర్లలో కమ్మిన్స్(4), స్టార్క్(3), హెజిల్వుడ్, హెడ్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, భారత్ 185 పరుగుల వెనుకంజలో ఉంది.