ప్రకాశం: సర్పంచులు, కార్యదర్శులు ఐక్యంగా గ్రామాల అభ్యున్నతకు నడుం బిగించాలని మద్దిపాడు ఎంపీడీవో కుమారి వి.జ్యోతి కోరారు. మద్దిపాడు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం జరిగిన సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ఆమె పాల్గొని ప్రారంభించారు. గ్రామాభివృద్ధికి ప్రణాళికలను రూపొందించుకోవాలన్నారు.