VSP: విశాఖపట్నం నగర మేయర్ హరి వెంకట కుమారి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆమె తన క్యాంపు కార్యాలయం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి ఆర్టీసీ బస్సులో చేరుకొని ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. విశాఖ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అందుకే తాను ఆర్టీసీ బస్సులో ప్రయాణించినట్లు వివరించారు.