SKLM: కవిటి మండలం బొర్రపుట్టుగ పాఠశాలకు ఉపాధ్యాయురాలు భారతి నడుచుకుని వెళ్తుండగా బొర్రపుట్టుగ సమీపంలో సోమవారం ఆమెపై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి బంగారం కోసం పెనుగులాడి విఫలమై రాయితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. చికిత్స నిమిత్తం కవిటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్సై రవి వర్మ కేసు నమోదు చేశామన్నారు.