ఎన్టీఆర్: విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. మూటము బాలమ్మ, ప్రభావతి అనే ఇద్దరు మహిళల వద్ద నుంచి 72 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మహిళలను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కేవీ సుధాకర్ తెలిపారు. దాడుల్లో ఎస్సై ఎం.రామశేషయ్య, కె.మధు, సిబ్బంది పాల్గొన్నారు.