Crude oil ధర తగ్గినా పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదు: మోడీకి కేటీఆర్ ప్రశ్న
ktr:ప్రధాని మోడీపై (modi) మంత్రి కేటీఆర్ (ktr) ఫైరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినా.. పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదని అడిగారు. ఈ మేరకు ధర వివరాల డేటాతో సహా ఆయన వివరించారు. 2014 మే నెలలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ (petrol) ధర రూ.71 ఉండేదని గుర్తుచేశారు.
ktr:ప్రధాని మోడీపై (modi) మంత్రి కేటీఆర్ (ktr) ఫైరయ్యారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినా.. పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదని అడిగారు. ఈ మేరకు ధర వివరాల డేటాతో సహా ఆయన వివరించారు. 2014 మే నెలలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 107 డాలర్లు ఉంటే.. లీటర్ పెట్రోల్ (petrol) ధర రూ.71 ఉండేదని గుర్తుచేశారు. 2023 మార్చి నాటికి క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 65 డాలర్లు మాత్రమే ఉందని..లీటర్ పెట్రోల్ (petrol) ధర రూ.110కి ఎలా పెరిగిందని అడిగారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే.. ఇంధన ధరలు పెంచారు. మరి క్రూడ్ ధర తగ్గితే ఇంధన ధరలు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ఎల్ పీజీ గ్యాస్ (lpg gas) ధర పెంపుపై మంత్రి కేటీఆర్ (ktr) ప్రశ్నించారు. ఇంధన ధరలు తగ్గించేందుకు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ (gst) పరిధిలోకి తీసుకురావాలని అంటున్నారు. ఎల్పీజీ జీఎస్టీ పరిధిలో ఉందని.. 8 ఏళ్లలో రూ.400 నుంచి రూ.1,200కి పెరిగిందని చెప్పుకొచ్చారు. జీఎస్టీలో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గించని ప్రభుత్వం.. పెట్రోలియం ఉత్పత్తులను మాత్రం తగ్గిస్తుందని ఎలా నమ్మాలని అడిగారు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (revanth reddy) కూడా మండిపడ్డారు. రేవంత్ (revanth) కామెంట్లను బీఆర్ఎస్ నేత ఒకరు ట్వీట్ చేయగా.. కేటీఆర్ స్పందించారు. రేవంత్‌కు మతిపోయింది.. ప్రతిపక్ష నేతలు ఊహాశక్తితో గొప్ప నవలా రచయితలు కాగలరని భావిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో వారికి మంచి జరగాలని చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
సచివాలయం కింద దొరికన నిజాం బంగారాన్ని కేటీఆర్ (ktr) తీసుకున్నారు. కొవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ కోసం కేటీఆర్ బావకు రూ.10 వేల కోట్లు వచ్చాయి. కేటీఆర్ పీఏకు (ktr pa) తెలిసినవాళ్లు గ్రూప్-1లో అధిక మార్కులు పొందారు అని ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి (revanth reddy) ఎప్పటికీ ఆధారాలు చూపని జోక్స్ ఇవీ అని కేటీఆర్ కొట్టిపారేశారు.