»Tspsc Paper Leak Accused Wife Alleges Third Degree
TSPSC Paper Leak: నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్ పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజశేఖర రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించినట్లు పోలీసు శాఖ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజశేఖర్ పైన పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఆయన భార్య సుచరిత ఆరోపించారు. తన భర్తకు వైద్య పరీక్షలు చేయించాలని కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజశేఖర రెడ్డిని కస్టడీకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు చేయించినట్లు పోలీసు శాఖ తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. కస్టడీ ముగిసిన అనంతరం కోర్టులో హాజరుపరిచే ముందు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని కోర్టుకు తెలిపారు. కస్టడీకి ఇచ్చే ముందు నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకే విచారణ జరుగుతుందన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషన్ పైన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ విషయంలో ఇంకా ఏమైనా సమస్య ఉంటే నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది.
ప్రశ్నాపత్రం లీకేజీ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాఫ్తు చేస్తోన్న విషయం తెలిసిందే. లీకేజీ పైన ఆరోపణలు చేసిన రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు అందిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో మీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వాలని అందులో పేర్కొన్నది సిట్. ఆయన తన ఆరోపణలకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పిస్తే ఆ దిశగా దర్యాఫ్తు చేస్తామని ఏసీపీ స్థాయి అధికారి ఈ నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్, ఈ కేసుకు సంబంధించి సంచలన ఆరోపణలు చేసిన మిగతా రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇచ్చే యోచనలో ఉంది.
తాను నోటీసులకు భయపడేది లేదని, లీకేజీ వ్యవహారంపై తమ దగ్గర ఉన్న ఆధారాలను సిట్ కు అందించేది లేదని చెప్పారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే ఆధారాలు ఇస్తామని తెలిపారు. లీకేజీ కేసును కావాలనే నీరుగారుస్తున్నారని, 30 లక్షల మంది నిరుద్యోగులకు తాము అండగా ఉంటామన్నారు. కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగే వరకు పోరాటం ఆపేది లేదన్నారు.