స్టార్ హీరోయిన్ అనుష్క.. దర్శకుడు క్రిష్ కాంబోలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘ఘాటి’. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది. అందులో అనుష్క స్వయంగా విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది.