KMM: దుమ్ముగూడెం మండలంలోని లక్ష్మీనగరంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఇవాళ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భద్రాచలంకి చెందిన ఓ ప్రైవేట్ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా వైద్య శిబిరాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.