»Rcb Win Over By Gujarat Giants Wpl 2023 At Mumbai
WPL 2023: గుజరాత్ జెయింట్స్ పై ఆర్సీబీ గెలుపు
మహిళల ప్రీమియర్ లీగ్(wpl 2023)లో శనివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)ను ఓడించింది. అయితే సోఫీ డివైన్ కేవలం 36 బంతుల్లో 99 పరుగులు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ సులువుగా విజయం సాధించింది.
స్మృతి మంధాన నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bangalore) జట్టు ఎట్టకేలకు భోణి కొట్టింది. బెంగళూరు జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ వరుసగా ఐదు గేమ్‌లను ఓడిపోయింది. ఈ క్రమంలో నాకౌట్ దశకు వెళ్లేక్రమంలో ఈ జట్టు నిన్న గుజరాత్ జెయింట్స్(Gujarat Giants)పై విజయం సాధించింది.
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన WPL 2023లో 16వ మ్యాచ్‌లో 189 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం సులువుగా ఛేదించి..8 వికెట్ల తేడాతో గెలుపొందింది. 189 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన RCB 15.3 ఓవర్లలోనే 189/2 స్కోరు సాధించింది. సోఫీ డివైన్(Sophie Devine) 36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 పరుగులు, ఇక స్మృతి మంధాన(smriti mandhana) 37 రన్స్ చేసి ఔట్ కాగా.. తర్వాత వచ్చిన ఎలైస్ పెర్రీ, ఎతర్ నైట్ 19, 22 పరులుగు చేసి లక్ష్యాన్ని సాధించారు.
ఈ క్రమంలో RCB ఓపెనర్ మహిళల T20 క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీని సోఫీ డివైన్(Sophie Devine) కొంచెంలో మిస్ చేసుకుంది. 36వ డెలివరీని ఎదుర్కొని తను ఔట్ అవుతుందని ఆమెకు తెలియకుండానే ఔట్ అయింది. సోఫీ 36 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 99 రన్స్ చేసింది.
మొదట బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ జెయింట్స్(Gujarat Giants) ఓపెనర్ లారా వోల్వార్డ్ 42 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరింగ్ చేయడంతో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. జీజీ కెప్టెన్ స్నేహ రాణా తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఆష్లీ గార్డనర్ కూడా 26 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సహా 41 పరుగులు చేసింది. మరోవైపు ఆర్సీబీ తరఫున శ్రేయాంక పాటిల్ రెండు వికెట్లు తీయగా, సోఫీ డివైన్, ప్రీతీ బోస్‌లు చెరో వికెట్ తీశారు.