NLR: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్తంగా ఈనెల 17న ఆత్మకూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చన్నారు.