»Mlc Election Win A Historic Victory Amit Shah Tweets
Amit Shah : ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు.. చారిత్రాత్మక విజయం అమిత్ షా ట్వీట్
తెలంగాణ (Telangana) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం (AVN Reddy's victory) పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలిపారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు.
తెలంగాణ (Telangana) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం (AVN Reddy’s victory) పట్ల కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలిపారు. మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో అవినీతి పాలనతో విసిగిపోయారని, మోదీ నాయకత్వంలోని పారదర్శకమైన బీజేపీ ప్రభుత్వ పాలన కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని అమిత్ షా ట్వీట్ చేశారు.
ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి(Legislative Council) నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై నెలకొంది. ఓట్ల లెక్కింపు మందకొడిగా కొనసాగడంతో గురువారం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా.. అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా మ్యాజిక్ ఫిగర్ 12,709 దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించడంతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో సమీప పీఆర్టీయూటీఎస్(PRTUTS) అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై (Chennakesava Reddy) గెలిచారు.కేసీఆర్ కుటుంబ అవినీతి ప్రభుత్వాన్ని సబ్బండ వర్ణాలు వ్యతిరేకిస్తున్నయని.
బీజేపీ (BJP) నేతృత్వంలో ప్రజల సమిష్టి ఉద్యమం తారాస్థాయికి చేరుకుంటోందని అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ (Double engine Sarkar) కోసం ఎదురుచూస్తున్నారు అనడానికి ఏవీఎన్ రెడ్డి విజయమే నిదర్శనం అన్నారు. మోడీ నేతృత్వం, కేంద్ర ప్రభుత్వం సహకారం, జాతీయ పార్టీ మార్గదర్శకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకం ఉందన్నారు. కాగా ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ (BRS) గా వ్యవహారం సాగుతున్న వేళ బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం ఆ విజయంపై నేరుగా అమిత్ షా (Amit Shah) స్పదించడం ఆసక్తిగా మారింది.