MDK: సమ్మెకు దిగిన కేజీబీవీ బోధన సిబ్బంది స్థానంలో రెగ్యులర్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులను భర్తీ చేసి కేజీబీవీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యార్థులకు అల్పాహారం, భోజనం ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు.