New dates of 9 exams:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విపక్షాలు అన్నీ ఆందోళన బాట పట్టాయి. మొత్తం మూడు పేపర్లు లీక్ కాగా.. మరో రెండు పేపర్లు ప్రవీణ్ (praveen) వద్ద పెన్ డ్రైవ్‌లో ఉన్నాయని సిట్ (sit) గుర్తించింది. దీంతోపాటు ఏప్రిల్ (april), మే (may) నెలలో జరిగే పరీక్షలకు సంబంధించిన రీ షెడ్యూల్ చేశారు.
New dates of 9 exams:టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజీ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విపక్షాలు అన్నీ ఆందోళన బాట పట్టాయి. మొత్తం మూడు పేపర్లు లీక్ కాగా.. మరో రెండు పేపర్లు ప్రవీణ్ (praveen) వద్ద పెన్ డ్రైవ్‌లో ఉన్నట్టు సిట్ (sit) గుర్తించింది. దీంతోపాటు ఏప్రిల్ (april), మే (may) నెలలో జరిగే పరీక్షలకు సంబంధించిన రీ షెడ్యూల్ చేశారు. కొత్త పేపర్లు రెడీ చేసి.. ప్రింట్ చేసేందుకు టైమ్ పట్టనుంది. అందుకే మొత్తం 9 పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటిస్తామని టీఎస్ పీఎస్సీ వర్గాలు తెలిపాయి. పేపర్ లీకేజీ కావడంతో ఏఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కూడా రద్దుచేశారు. సిట్ మాత్రం 5 పేపర్లు ఉన్నాయని.. అందులో 3 పరీక్షలు జరిగాయని.. మరో రెండు జరగాల్సి ఉన్నాయని మాత్రం చెబుతుంది.
టీఎస్ పీఎస్సీ (Tspsc) పేపర్ లీకేజ్ అంశం రాష్ట్రంలో హీటెక్కిస్తోంది. లీకేజీకి సంబంధించి కొత్త విషయం తెలుస్తోంది. లీకేజీలో రేణుక (renuka) కీ రోల్ పోషించారని సిట్ విచారణలో తేలింది. ప్రవీణ్ స్త్రీ లోభి అని.. రేణుకకు పేపర్లు విక్రయించాడని పేర్కొంది. మొత్తం 5 పేపర్ల డేటా ప్రవీణ్ వద్ద ఉందని తెలిపింది. మరో రెండు పరీక్షలు ఎంవీఐ, గ్రౌండ్ వాటర్ శాఖ పోస్టుల పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ ప్రశ్నాపత్రాలను సమయం చూసి ఇస్తానని రేణుకకు ప్రవీణ్ చెప్పాడని సిట్ చీఫ్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రవీణ్ 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడట. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది (40) మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే.