KNR: హుజురాబాద్ పట్టణంలోని విశ్వ ప్రగతి పాఠశాల భవనాన్ని ఖాళీ చేయించాలని హైకోర్టు తీర్పునివ్వడంతో విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. పాఠశాలను వేరే చోటికి మారిస్తే పిల్లలు చదువు దెబ్బతింటుందని ఈ సంవత్సరం ఈ పాఠశాలలోనే తరగతులు నిర్వహించాలని ఎంఈఓ శ్రీనివాస్‌తో వాగ్వాదానికి దిగారు.