NGKL: కాంగ్రెస్ ఏడాది ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. బుధవారం అచ్చంపేట ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఏడాది కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించే వారిపై దాడులు, ఇండ్లు కూల్చివేతలు కొనసాగించారన్నారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్దే కనపడుతుంది తప్ప కొత్తగా చేసింది ఏం లేదన్నారు.