SRCL: ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్లలోని పెద్దూర్ సమీపంలో ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే విద్యాలయాన్ని కలెక్టర్, అదనపు కలెక్టర్ ఖీమ్యా, ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్వచ్ఛత, పరిశుభ్రతను అలాగే స్టోర్ రూంలోని బియ్యం, కూరగాయలను వారు పరిశీలించారు.