ప్రకాశం: చీరాలలోని విజిలిపేట నందు బుధవారం ముగిరి క్రాంతి కుమార్ అనే వ్యక్తి అక్రమంగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నాడని సమాచారంతో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి 9 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అతని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.