PLD: ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఛైర్మన్ జగన్మోహన్ రెడ్డి కోరారు. బుధవారం రెడ్ క్రాస్ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు అవసరమైన రక్తాన్ని అతి తక్కువ వ్యయంతో అందజేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 13న జిల్లా ఇంఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బ్లడ్ బ్యాంక్‌ను ప్రారంభిస్తారని తెలిపారు.