KKD: పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బుధవారం గండేపల్లి మండలం సుబ్బయ్యమ్మపేట గ్రామంలో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో సారాయి తయారీకి నిల్వ ఉంచిన సుమారు 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. తయారీ దారులపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ అర్జునరావు తెలిపారు. ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు.