VZM: శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో గీతా జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల పోటీలు చేపట్టారు. విజేతలకు బహుమతులు అందజేశారు. విష్ణు సహస్రనామ, భగవద్గీత పారాయణం సామూహికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమరసతా సేవా ఫౌండేషన్ ప్రతినిధి లక్ష్మి పాల్గొన్నారు.