ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై విక్టరి వెంకటేశ్ ప్రశంసలు కురిపించారు. ‘పుష్ప-2’లో బన్నీ యాక్టింగ్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో చూపు తిప్పుకోలేకపోయినట్లు పేర్కొన్నారు. ఈ సినిమాకు వస్తోన్న ప్రశంసలు చూస్తుంటే ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే, హీరోయిన్ రష్మిక అసాధారణ ప్రదర్శన చేసిందని ప్రశంసించారు.