అస్వస్థతతో మోహన్ బాబు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ‘మోహన్ బాబు ఎడమ కన్ను కింద గాయమైంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. మోహన్ బాబు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మరో రెండు రోజులు వైద్యుల పర్యవేక్షణ అవసరం’ అని బులిటెన్లో డాక్టర్లు పేర్కొన్నారు.