టాలీవుడ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన సినిమా ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. అయితే ఈ మూవీ నుంచి ‘అదిదా సర్ప్రైజ్’ అనే ఐటెం సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ పాట విడుదల వాయిదా పడింది. టెక్నికల్ సమస్య వల్ల దీన్ని వాయిదా వేసినట్లు మేకర్స్ తెలిపారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది.