పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ షెడ్యూల్లో పవన్ కూడా పాల్గొంటున్నాడు. ఈ మేరకు చిత్ర బృందం పవర్‌స్టార్ వర్కింగ్ స్టిల్‌ను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది. కాగా ఈ మూవీ మార్చి 28న విడుదల కానుంది.