»Narendra Modi Biggest Contender For Nobel Peace Prize Says Asle Toje
Noble Prize నరేంద్ర మోదీకి శాంతి బహుమతి? సోషల్ మీడియాలో వైరల్
నియంత.. అహంకారి.. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన మోదీకి శాంతి బహుమతినా? అంటూ హేళన చేస్తున్నారు. గుజరాత్ లో గోద్రా అల్లర్లు సృష్టించిన వ్యక్తికి శాంతి బహుమతి వస్తుందా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నర హంతకుడు మోదీకి శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.
నోబెల్ (Nobel) శాంతి బహుమతి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి రానుందా? ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నోబెల్ అవార్డు మోదీకి వస్తుందనే వార్త ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఆ అవార్డు రేసు (Race)లో మోదీ ఉన్నాడని సోషల్ మీడియా (Social Media)లో చర్చ జరిగింది. త్వరలోనే ఆయనకు అంతర్జాతీయ శాంతి బహుమతి (Nobel Peace Prize) లభిస్తోందనే వార్తలు వైరల్ (Viral)గా మారాయి. ఈ ఏడాది ప్రకటించే అవార్డుల్లో మోదీకి తప్పనిసరిగా అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ చర్చ (Discussion) మొదలు కావడానికి కారణమేమిటంటే.. నార్వే (Norway) కు చెందిన నోబెల్ అవార్డుల కమిటీ ఇటీవల భారత్ ను సందర్శించడమే.
ఈ కమిటీ భారతదేశం (India)లో పర్యటించింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రంగాల ప్రముఖలతో ఈ కమిటీ సమావేశమైంది. ఈ క్రమంలోనే ఆ కమిటీ డిప్యూటీ చైర్మన్ అస్లే టోజే (Asle Toje) ప్రధాని మోదీని కూడా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మోదీతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీసింది. ‘నోబెల్ శాంతి బహుమతికి మోదీ అతి పెద్ద పోటీదారు. ఆయన ప్రపంచ శాంతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రపంచ శాంతి క్రమాన్ని పునరుద్ధరించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్నారు’ అని నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే తోజే ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లో నోబెల్ అవార్డుల ప్రకటన జరుగనుంది. ఈ వార్తలను బీజేపీ సోషల్ మీడియా వింగ్ వైరల్ గా చేసింది. అంతర్జాతీయంగా అవార్డు కమిటీని ప్రభావితం చేసేలా పోస్టులు సృష్టించింది.
ఈ వార్తల నేపథ్యంలో కాషాయ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రయిన్- రష్యా యుద్ధాన్ని నరేంద్ర మోదీ ఆపడంతోనే నోబెల్ బహుమతి రాబోతున్నదని చర్చించుకుంటున్నారు. ఈ వార్తలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. నియంత.. అహంకారి.. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన మోదీకి శాంతి బహుమతినా? అంటూ హేళన చేస్తున్నారు. గుజరాత్ లో గోద్రా అల్లర్లు సృష్టించిన వ్యక్తికి శాంతి బహుమతి వస్తుందా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నర హంతకుడు మోదీకి శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా నోబెల్ కమిటీ మహాత్మా గాంధీకి నోబెల్ శాంతి బహుమతి ప్రకటించడంపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తున్నది. గతంలో ఎప్పటి నుంచో గాంధీకి నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రతిపాదనలు, చర్చలు జరిగాయి. ఈసారైనా గాంధీ అవార్డు దక్కాలని ప్రజాస్వామ్యవాదులు, గాంధేయవాదులు డిమాండ్ చేస్తున్నారు. కాగా నోబెల్ కమిటీని ప్రభావితం చేసేలా బీజేపీ నాయకుల ధోరణి ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియా ద్వారా నోబెల్ కమిటీని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.