NLR: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ యనమల నాగరాజు సూచించారు. దుత్తలూరు మండలం మందాలనాయుడుపల్లిలో రెవెన్యూ సదస్సు మంగళవారం నిర్వహించారు. పలు రకాల సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.