పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ అప్రధాన్య వ్యాపారాల నుంచి క్రమంగా తప్పుకుంటోంది. సినిమా, ఈవెంట్ టికెట్లను విక్రయించే పేటీఎం ఇన్‌సైడర్‌ను ఇటీవలే జొమాటోకు విక్రయించడం ద్వారా రూ.2,048 కోట్లు సమకూర్చుకుంది. తాజాగా జపాన్‌కు చెందిన పేపే కార్పొరేషన్లో తనకున్న వాటాలను విక్రయించాలని నిర్ణయించింది. ఈ వాటాల విలువ సుమారు రూ.2,000 కోట్లు ఉంటుందని అంచనా.