టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ ఆరోగ్యం బాగుపడటం కోసం ఏదైనా చేస్తామని దిగ్గజం సునీల్ గవాస్కర్ వెల్లడించారు. 1983 ప్రపంచకప్ విజేత జట్టు ఆటగాళ్లందరూ అతనికి తోడుంటానన్నారని చెప్పారు. అతను తిరిగి నిలబడేలా చేయాలనుకుంటున్నాం. అందుకు ఏదైనా చేస్తామని అన్నారు. కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో కాంబ్లీ కనీసం నిలబడలేకపోతున్న ఓ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.