మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. గత సీజన్ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు పెరిగింది. మహిళల ప్రిమియర్ లీగ్ వేలంలో 120 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ఇందులో 91 మంది భారత ఆటగాళ్లు, 29 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు.