TG: గ్రూప్-2 పరీక్షలను TGPSC ఈ నెల 15, 16వ తేదీల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. మొత్తం నాలుగు పేపర్లలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. పేపర్-1, పేపర్-2 డిసెంబర్ 15న, పేపర్-3, పేపర్-4 డిసెంబర్ 16న రెండు సెషన్లలో ఉండనున్నాయి. అయితే, ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లు ఈ నెల 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని TGPSC కార్యదర్శి నవీన్ తెలిపారు.