AP: కడప మున్సిపల్ హైస్కూల్లో పేరెంట్స్- టీచర్ మీటింగ్ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లతో పవన్ ముచ్చటించారు. దేశం బాగుండాలంటే అధ్యాపకులపై పెట్టుబడులు పెట్టాలన్నారు. అందరికంటే టీచర్లకు ఎక్కువ జీతం ఉండాలనేది తన కోరిక అని వెల్లడించారు. హీరోలు సినిమాల్లో కాదు, ఉపాధ్యాయుల్లోనూ ఉన్నారన్నారు.